indian360world

Guntur Kaaram Item Song Shocking Update l మంట పుట్టిస్తున్న గుంటూరు కారం ఐటం సాంగ్ 2024

Guntur Kaaram Item Song Shocking Update:- సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోరు మీదున్నారు అనే చెప్పాలి. ఇటీవల వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలతో వరుసగా సక్సెస్ లు సొంతము చేసుకుని దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చాలా ఏళ్ళ గ్యాప్ అనంతరం సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ మూవీ పై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.

Guntur Kaaram Item Song Shocking Update

కాగా ఈ ఫ్యామిలీ యాక్షన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో సూపర్ స్టార్ కి జోడీగా యువ అందాల కథానాయికలు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారం మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ తో పాటు అనంతరం రిలీజ్ అయిన Dum Masala అలానే Oh My Baby సాంగ్స్ రెండూ కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

అయితే మ్యాటర్ ఏమిటంటే, అతి త్వరలో ఈ మూవీ నుండి స్పెషల్ మాస్ సాంగ్ అయిన ఐటెం సాంగ్ ని రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారట మేకర్స్. ఇక ఈ సాంగ్ లో యంగ్ బ్యూటీ డింపుల్ హయతి సూపర్ స్టార్ మహేష్ తో కలిసి చిందేయనుందని అంటున్నారు. ఈ సాంగ్ ఎంతో మాస్ స్టైల్ లో సాగడంతో పాటు ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని టాక్. ఇక గుంటూరు కారం నుండి మిగిలిన రెండు సాంగ్స్ అలానే ఒక బిట్ సాంగ్ ని రిలీజ్ చేసి తాము ప్రకటించిన విధంగా పక్కాగా సంక్రాంతి 2024 కానుకగా జనవరి 12న మూవీని గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలానే ఈమూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా అతి తీవ్రాలో అప్ డేట్ రానుందట.

Guntur Kaaram Item Song Shocking Update

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Guntur Kaaram Item Song Shocking Update

Exit mobile version