Salaar First Day Collection:- టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ (Salaar) పార్ట్ 1 సీజ్ ఫైర్. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించగా భువన గౌడ ఫోటోగ్రఫి అందించారు. ప్రారంభం నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన సలార్ మూవీ గ్రాండ్ గా నేడు వరల్డ్ వైడ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది.
ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫస్ట్ డే ప్రీమియర్స్ నుండి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాహుబలి 2 మూవీ తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించిన అన్ని అంశాలు ఇందులో పొందుపరిచారు దర్శకుడు ప్రశాంత్ నీల్. భారీ మాస్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ లో ప్రభాస్ తన పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సలార్ లో గ్రాండియర్ విజువల్స్ తో పాటు ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోయాయి.
Salaar First Day Collection
ఇక ఈ మూవీ యొక్క డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్ దాదాపుగా రూ.150 కోట్ల వరకు లభించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, ఓవర్సీస్ లో సైతం భారీ స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టింది సలార్ మూవీ. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించగా ఇతర కీలక పాత్రల్లో జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, టిన్ను ఆనంద్ నటించారు. మరి రాబోయే రోజుల్లో సలార్ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుందో, ఏ రేంజ్ కలెక్షన్ దక్కించుకుంటుందో చూడాలి.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Salaar First Day Collection