indian360world

Animal Boxoffice Collection Was Shocking l షాకింగ్ రేంజ్ లో ఆనిమల్ బాక్సాఫీస్ కలెక్షన్ 2023

Animal Boxoffice Collection Was Shocking:- బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా రష్మిక మందున్న (Rashmika Mandanna) హీరోయిన్ గా భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ ఆనిమల్ (Animal).

ఈ మూవీని యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించగా కీలక పాత్రల్లో పృథ్వీరాజ్, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నటించారు. ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ డిసెంబర్ 1న పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే భారీ కలెక్షన్ తో సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ సహా అనేక ప్రాంతాల్లో ఆనిమల్ మూవీ భారీ స్థాయి కలెక్షన్ సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది.

Animal Boxoffice Collection Was Shocking

ముఖ్యంగా మన దేశంతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, యుకె వంటి ప్రాంతాల్లో ఈ మూవీ ఆడియన్స్ మరింతగా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం సలార్, డన్కి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నప్పటికీ కూడా ఆనిమల్ ఇంకా తన హవాని కొనసాగిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ మూవీ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా గ్రాస్ తో కొనసాగుతోంది.

Animal Boxoffice Collection Was Shocking

హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న ల సూపర్ యాక్టింగ్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించారు. ముఖ్యంగా లవ్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని రణబీర్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడక్కడా కొందరి నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నిటినీ తట్టుకుని ఆనిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుండడం ఎంతో ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో ఈ మూవీ తప్పకుండా రూ. 1000 కోట్లు కూడా సొంతం చేసుకునే అవకాశం గట్టిగా కనపడుతోందని యూనిట్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

Animal Boxoffice Collection Was Shocking

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Animal Boxoffice Collection Was Shocking

Exit mobile version