indian360world

Animal Latest Collection Mind Blocking l మైండ్ బ్లాక్ చేస్తున్న ఆనిమల్ లేటెస్ట్ కలెక్షన్ 2023

Animal Latest Collection Mind Blocking:- రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ పాన్ ఇండియన్ మూవీ ఆనిమల్ (Animal Boxoffice Collection). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అనిల్ కపూర్, శక్తి కపూర్, పృథ్వీరాజ్, త్రిప్తి దిమ్రి (Tripti Dimri), బాబీ డియోల్ (Bobby Deol) నటించారు.

ఇక డిసెంబర్ 1 న పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ ని అలానే అద్భుతమైన కలెక్షన్ ని సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కాగా ఈ మూవీని భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ ఫిలిమ్స్, సినీ వన్ స్టూడియోస్ సంస్థలు అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి. ఆనిమల్ మూవీ లో రణబీర్ కపూర్ నటనకు సూపర్ గా ప్రసంశలు లభించడంతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ ప్రతిభకు మరింత మంచి క్రేజ్ లభిస్తోంది.

Animal Latest Collection Mind Blocking

నిజానికి ఫస్ట్ డే ఆనిమల్ కి ఒకింత మిశ్రమ స్పందన లభించినప్పటికీ కంటెంట్ ప్రేక్షకాభిమానులని ఆకట్టుకోవడంతో ఈ మూవీ రోజు రోజుకు అందరినీ అలరించి ప్రస్తుతం రూ. 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇటీవల బ్రహ్మాస్త్ర మూవీతో మంచి సక్సెస్ అందుకుని కెరీర్ పరంగా ట్రాక్ లోకి వచ్చిన రణబీర్ కపూర్ కపూర్ కెరీర్ లో ఆనిమల్ టాప్ బెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీగా ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Animal Latest Collection Mind Blocking

ఓవైపు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) డన్కి, మరోవైపు ప్రభాస్ (Prabhas) సలార్ సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఏమాత్రం తగ్గేదేలే అంటూ కొనసాగుతోంది ఆనిమల్. ఇక ఈ మూవీ మోతంగా గడచిన 23 రోజుల్లో రూ. 900 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ కి చేరువైంది. ఇక కేవలం మరొక రూ. 100 కోట్లు సొంతం చేసుకుంటే ఆనిమల్ కూడా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరినట్లే అని, అలానే ఈ మూవీకి అది రాబోయే మరికొద్ది రోజుల్లో సాధ్యపడుతుందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

అటు హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్ అందుకుంటున్న మూవీగా అలానే ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక కలెక్షన్ అందుకున్న హిందీ డబ్బింగ్ మూవీ దిశగా దూసుకుపోతోంది ఆనిమల్. అలానే యుఎస్ఏ తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, యుకె వంటి ప్రాంతాల్లో ఈ మూవీకి ఇంకా మంచి కలెక్షన్ లభిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి.

Animal Latest Collection Mind Blocking

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Animal Latest Collection Mind Blocking

Exit mobile version