indian360world

Salaar Second Day Collection Was Shocking l మెంటలెక్కిస్తున్న సలార్ రెండవ రోజు కలెక్షన్ 2023

Salaar Second Day Collection Was Shocking:- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరగందూర్ నిర్మించగా ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, టిన్ను ఆనంద్ నటించారు.

ఇక ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక సలార్ మూవీ మొత్తంగా డిసెంబర్ 22న గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్ పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సలార్ కి సూపర్ హిట్ టాక్ అయితే లభించింది. హిందీ తో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాలు అలానే ఓవర్సీస్ లో కూడా సలార్ కు మంచి పాజిటివ్ రివ్యూస్ లభించాయి.

Salaar Second Day Collection Was Shocking

బాహుబలి 2 తరువాత పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ కలిగిన ప్రభాస్ కు సరైన మూవీ పడిందని, అలానే ఈ మూవీలో దేవా పాత్రలో సలార్ సూపర్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి పేరు లభిస్తోంది. తన ఆకట్టుకునే అందం, అభినయంతో శృతి హాసన్ కూడా అలరించారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని మాస్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి ఆకట్టుకున్నారు.

Salaar Second Day Collection Was Shocking

పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు వంటి వారి పాత్రలు సినిమాలు పెద్ద ప్లస్ అయ్యాయి. ఇక ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ. 178. 71 కోట్లు రాబట్టిన సలార్ మూవీ సెకండ్ డే రూ. 117 కోట్ల గ్రాస్ రాబట్టి మొత్తంగా రెండు రోజుల్లో కలిపి రూ. 295.7 కోట్లు రాబట్టడం విశేషం. కాగా రేపు క్రిస్మస్ పండుగ కావడంతో ఈ మూవీ మరింతగా అందుకునే అవకాశం ఉందని, అలానే రాబోయే రోజుల్లో సలార్ ఇంకేంతమేర కలెక్షన్ అందుకుంటుందో చూడాలని పలువురు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Salaar Second Day Collection Was Shocking

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Salaar Second Day Collection Was Shocking

Exit mobile version