Tripti Dimri Biography Life Secrets Boyfriend l త్రిప్తి దిమ్రీ బయోగ్రఫీ లైఫ్ సీక్రెట్స్ బాయ్‌ఫ్రెండ్ 2024

Written by naga

Published on:

Tripti Dimri Biography Life Secrets Boyfriend:- ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఆనిమల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో త్రిప్తి దిమ్రి, అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్ నటించారు. ముఖ్యంగా యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఆనిమల్ మూవీ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్ తో పలు ప్రాంతాల్లోని థియేటర్స్ లో దూసుకెళుతోంది.

అయితే ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినప్పటికీ కూడా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా జోయా పాత్రలో కొద్దిసేపటి కనపడి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ మనసు దోచారు యువ కథానాయిక త్రిప్తి దిమ్రి. అయితే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన త్రిప్తి ఆడియన్స్ మనసు దోచడంతో పాటు బాగా క్రేజ్ కూడా సొంతం చేసుకున్నారు. అమాంతం ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా పెరిగిపోయారు. ఇక అందరూ కూడా అసలు ఎవరు ఈ త్రిప్తి అంటూ గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలెట్టేసారు. మరి ఇప్పుడు మనం త్రిపాఠి దిమ్రి పూర్తి బయోగ్రఫీని చూద్దాం. ముందుగా త్రిప్తి 1994, ఫిబ్రవరి 23వ తేదీన ఉత్తరాఖండ్ లోని గార్బోవల్ లో మీనాక్షి దిమ్రి, దినేష్ దిమ్రి దంపతులకు జన్మించారు.

ఆశుతోక్ దిమ్రి అనే సోదరుడు, కృత్రిక దిమ్రి అనే సోదరి ఉన్నారు. కాగా ఆమె సోదరుడు ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగిగా పని చేస్తుండగా సోదరి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు. ఇక త్రిప్తి దిమ్కి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి నటులు అంటే మొదటి నుండి ఎంతో ఇష్టం. అలానే హీరోయిన్స్ లో దీపికా పదుకొనె, దర్శకుల్లో కరణ్ జోహార్ లను ఎంతో ఇష్టపడుతుంటారు. అలానే చేతన్ భగత్ యొక్క రచనలని ఖాళీ సమయంలో చదువుతానని చెప్తున్నారు త్రిప్తి. ఇక తాను జన్మించిన ఉత్తరాఖండ్ లో స్కూల్ విద్యాబ్యాసాన్ని పూర్తి చేసిన త్రిప్తి ఢిల్లీ విశ్వవిద్యాలయం, శ్రీ అరబిందో కళాశాలలో సైకాలజీ డిగ్రీ చదువుకున్నారు.

Tripti Dimri Biography Life Secrets Boyfriend

అనంతరం పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో అభినయాన్ని అభ్యసించారు. ఇక 2017 లో రిలీజ్ అయిన పోస్టర్ బాయ్స్ త్రిప్తి దిమ్రి నటించిన తొలి సినిమా. దానికి శ్రేయాస్ తలపడే దర్శకత్వం వహించారు. అందులో సన్నీ డియోల్, బాబీ డియోల్ అందులో కీలక పాత్రలు చేశారు. నిజానికి ఈ సినిమాలో తన మోడలింగ్ చూసి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా అవకాశం వచ్చింది. ఒరిజినల్ వర్షన్ అయిన మరాఠీ పోస్టర్ బాయ్స్ కి ఇది అనువాదం. ఈ సినిమాలో త్రిప్తి రియా పాత్రలో నటించారు. అలానే ఈ సినిమాతో మంచి ప్రసంశలు అందుకుంది.

అలా సినీ రంగ ప్రవేశం చేసిన త్రిప్తి 2017లో శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన మామ్ సినిమాలో నటించింది. అనంతరం 2018లో అవినాష్ తివారి సరసన రొమాంటిక్ డ్రామా మూవీ లైలా మజ్నులో నటించింది. ఈ సినిమాలో త్రిప్తి కనబరిచిన నటన అందరినీ ఆకట్టుకుంది. కొంత విరామం తరువాత సూపర్ నాచురల్ డ్రామా మూవీ అయిన బుల్ బుల్ సినిమాలో నటించారు త్రిప్తి. ఈ సినిమాలోనూ కథానాయకుడిగా అవినాష్ తివారినే కనిపించగా అనుష్క శర్మ ఈ సినిమాని నిర్మించారు.

ఈ సినిమాలో త్రిప్తి కళ్ళతోనే కోటి భావాలను పలికించిందనే ప్రసంశలు దక్కాయి మరియు ఈ సినిమాకి గాను ఫిలిం ఫేర్ వారి ఓటిటి అవార్డు ఆమెకు లభించింది. 2020 లో పాండ్స్ టాల్కమ్ పొడి యాడ్ లో కనిపించారు త్రిప్తి. ఇక 2020లో రిడీఫ్ డాట్ కామ్ వారు జరిపిన సర్వేలో ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమెకు 8వ స్థానం దక్కింది. అనంతరం 2021లో ఫోర్బ్స్ ఆసియా అండర్ 30 జాబితాలో త్రిప్తికి స్థానం దక్కింది.

Tripti Dimri Biography Life Secrets Boyfriend

ఇక 2022లో తిరిగి దత్ తో కలిసి నటించిన కళ సినిమాలో కూడా ఆమెకు మంచి ప్రసంశలు దక్కాయి. ఈ సినిమాలో త్రిప్తి టైటిల్ రోల్ లో కనిపించారు మరియు ఆమె పాడిన పాట ఎంతో సక్సెస్ అయింది. అంతేకాక మ్యూజికల్ ఈవెంట్స్ లో పాపులర్ సింగర్స్ తో కలిసి ఆమె పాటలు కూడా పాడుతుంటారు. ఇక 2023 డిసెంబర్ లో వచ్చిన ఆనిమల్ సూపర్ డూపర్ సక్సెస్ ఆమె కెరీర్ ని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. దానితో ఆమె నెక్స్ట్ ఆఫర్ల గురించి అందరిలో ఎంతో ఆసక్తి ఏర్పడింది. మొత్తంగా ఒక్క సినిమాతో త్రిప్తి కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది.

ఇక తాజాగా ఆమె ఒక బడా బాలీవుడ్ ఆఫర్ ని సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల బజ్. ఇటీవల బాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచిన ఆషికి సిరీస్ లోని ఆషికి 3 మూవీలో త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టినట్లు చెప్తున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీని లూడో, బర్ఫీ సినిమాల దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కించనుండగా గ్రాండ్ లెవెల్లో టి సిరీస్ సంస్థ పై భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకుని కెరీర్ పరంగా సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్లాలని కోరుకుందాం.

Tripti Dimri Biography Life Secrets Boyfriend

Animal Heroine Tripti Dimri Biography Life Secrets Boyfriend

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Animal Heroine Tripti Dimri Biography Life Secrets Boyfriend

2 thoughts on “Tripti Dimri Biography Life Secrets Boyfriend l త్రిప్తి దిమ్రీ బయోగ్రఫీ లైఫ్ సీక్రెట్స్ బాయ్‌ఫ్రెండ్ 2024”

Leave a Comment