Pawan Kalyan New Movie Shocking Update:- టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల యొక్క షూటింగ్స్ లో విరివిగా పాల్గొంటున్నారు. అయితే మరోవైపు తన జనసేన పార్టీ కార్యకలాపాలతో కూడా బిజీగా ఉన్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఓ వైపు తన జనసేన పార్టీని కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు.
ఆ కారణం రీత్యా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలకు ఇటీవల షూటింగ్ బ్రేక్ పడింది. ఆ మూడు సినిమాలు ఏవనగా బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్, హృద్యమైన ఎమోషనల్ సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు, అలానే వీటి తోపాటు యువ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న మాస్ గ్యాంగస్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి.
Pawan Kalyan New Movie Shocking Update
అయితే ఈ మూడు సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ నటించనున్న మరొక సినిమా యొక్క ప్రకటన కూడా వచ్చింది. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న భారీ మూవీ కూడా లిస్ట్ లో వుంది. ప్రముఖ దర్శకుడు మరియు కధకుడు అయిన వక్కంతం వంశీ ఈ సినిమాకి పవర్ ఫుల్ స్టోరీని అందిస్తున్నారు.
Pawan Kalyan New Movie Shocking Update
ఇటీవల తాను నితిన్ హీరోగా తెరకెక్కించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ యొక్క ప్రమోషనల్ ఇంటర్వూస్ లో భాగంగా వక్కంతం వంశీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న మూవీ యొక్క స్టోరీ సోషల్ సెటైరికల్ డ్రామాగా సాగుతుందని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరూ కూడా ఆయన నుండి ఆశించే అన్ని అంశాలు ఆ సినిమాలో వుంటాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రతిష్టాత్మక క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిపారు.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి