Pushpa 2 Powerful Update l పుష్ప 2 నుండి పవర్ఫుల్ అప్డేట్ 

Written by naga

Published on:

Pushpa 2 Powerful Update:- టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. రెండేళ్ల క్రితం మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప 1 మూవీ కి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతుంది. ఇక రిలీజ్ అనంతరం పుష్ప మూవీలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అత్యద్భుత పెర్ఫార్మన్స్ కి నార్మల్ ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాదు విమర్శకుల నుండి సైతం విశేషమైన ప్రసంశలు దక్కాయి.

ఇక ఇటీవల ఈ మూవీలోని అద్భుత నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించిన విషయం తెలిసిందే. దానితో అందరిలో పుష్ప 2 పై విశేషంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీ ఇప్పటికే అరవై సైతం వరకు షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తుంది.

Pushpa 2 Powerful Update

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, జగపతిబాబు, అనసూయ భరధ్వాజ్, ప్రకాష్ రాజ్, సునీల్, రావు రమేష్, ధనుంజయ, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్న పుష్ప 2 మూవీ 2024 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

Pushpa 2 Powerful Update

అయితే విషయం ఏమి టంటే పుష్ప 2 నుంచి ఇటీవల రిలీజ్ అయిన గంగానమ్మ జాతర ఫస్ట్ లుక్ పోస్టర్ గాని, అలానే ఫస్ట్ లుక్ టీజర్ గాని అందరి నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా రానున్న జనవరి 26న పుష్ప 2 నుంచి మరొక భారీ అప్డేట్ రానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్. ఒకవేళ ఇదే గనక నిజం అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది పండుగ న్యూస్ అనే చెప్పాలి. కాగా దీనిపై పుష్ప 2 మేకర్స్ నుంచి ఆఫిసిఅల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది.

Pushpa 2 Powerful Update

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Pushpa 2 Powerful Update

Leave a Comment