Shocking Response to Guntur Kaaram Kurchi Madathapetti Song Promo l గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమోకి షాకింగ్ రెస్పాన్స్ 2024

Written by naga

Published on:

Shocking Response to Guntur Kaaram Kurchi Madathapetti Song Promo:- మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమౌతున్న తాజా మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం.

ఈ మూవీ పై ప్రారంభం నాటి నుంచి మహేష్ బాబు అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, హైపర్ ఆది, బ్రహ్మానందం, కీలక పాత్రలు పోషిస్తున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానుంది.

Shocking Response to Guntur Kaaram Kurchi Madathapetti Song Promo

రాక్ స్టార్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా సెకండ్ సాంగ్ ఓ మై బేబీ, మూడవ సాంగ్ కుర్చీ మడతపెట్టి ప్రోమో అన్ని కూడా కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచి అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఇటు ఆడియన్స్ లో విశేషంగా క్రేజ్ అయితే సొంతం చేసుకున్నాయి. ఇక విషయం ఏమిటంటే కుర్చీ మడతపెట్టి సాంగ్ యొక్క ప్రోమో యూట్యూబ్ లో విడుదల చేసారు.

Shocking Response to Guntur Kaaram Kurchi Madathapetti Song Promo

అందరి నుంచి కూడా ఈ ప్రోమో సాంగ్ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరికల్ వీడియోని రేపు విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ ప్రోమోని బట్టి చూస్తే ఇందులో మహేష్ బాబు, శ్రీలీల ఇద్దరూ కూడా తమ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రోమోకే ఇలా అయిపోతే రేపు ఫుల్ సాంగ్ కి మరింతగా సంతోషం వ్యక్తం చేస్తారు అంటున్నారు మేకర్స్. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ రిలీజ్ తర్వాత ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Shocking Response to Guntur Kaaram Kurchi Madathapetti Song Promo

మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Shocking Response to Guntur Kaaram Kurchi Madathapetti Song Promo

Leave a Comment