Oh God! Game Changer will Release Then Only l వామ్మో గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యేది అప్పుడా 2023

Written by naga

Published on:

Game Changer will Release Then Only:- ఇటీవల దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక నటుడు ఎన్టీఆర్ తో కలిసి చేసిన RRR మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆ మూవీ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేయగా అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో ఆయన చేస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషిస్తుండగా కార్తీక్ సుబ్బరాజ్ కథని అందించారు. ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన గేమ్ ఛేంజర్ నుండి ఇటీవల జరగండి అనే సాంగ్ ముందుగా సోషల్ మీడియాలో లీక్ ల బారిన పడడంతో అనంతరం మేకర్స్ ముందుగా దానిని అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ముందుగా ఆ సాంగ్ ని ఇటీవలి దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నాం అని ప్రకటించారు.

Game Changer will Release Then Only

అయితే కొన్ని కారణాల వలన దానిని వాయిదా వేశారు. ఇక అంతకముందు కొన్ని నెలల క్రితం గేమ్ ఛేంజర్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వచింది. అది మొదలుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క అప్ డేట్ కూడా మేకర్స్ నుండి లేకపోవడంతో ఒకింత రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ షూటింగ్ తో బిజీ బిజీ గా ఉన్నారు దర్శకుడు శంకర్. ఈ మూవీ పై కూడా అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ కనపడుతోంది. కాగా ముఖ్య విషయం ఏమిటంటే, అసలు వచ్చే ఏడాది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అనేది ఉంటుందా లేదా అనే సందేహం అందరిలో మెదులుతోంది. అందుతున్న లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం గేమ్ ఛేంజర్ ని వచ్చే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఒకవేళ అది మిస్ అయితే ఇక 2025 జనవరిలోనే రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుండి మాత్రం అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Game Changer will Release Then Only

మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Game Changer will Release Then Only

Leave a Comment