Curiosity on Pawan Kalyan Movie Releases:- ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా ఒక్కో సినిమాతో కేరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇక తాజాగా ఆయన మొత్తం మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు కాగా వేరొకటి సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి, ఇంకొకటి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.
Curiosity on Pawan Kalyan Movie Releases
మొత్తంగా ఈ మూడు సినిమాల పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎంతో క్యూరియాసిటీ ఉంది. అయితే అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఎక్కువగా పార్టీకే సమయాన్ని కేటాయిస్తున్న పవన్, కొన్నాళ్ళు సినిమాల షూటింగ్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే ఆయన నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ఆసక్తి కేవలం అభిమానులలో మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఉంది. ముందుగా వీటిలో ఓజి దాదాపుగా 60 నుంచి 70 శాతం వరుకు షూటింగ్ జరుపుకోగా, ఉస్తాద్ భగత్ సింగ్ 40 శాతం వరుకు అలానే హరిహర వీరమల్లు కూడా 70 శాతం వరకు షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తోంది.
Curiosity on Pawan Kalyan Movie Releases
ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం వీటిలో ముందుగా ఓజి మూవీ వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ చేయనున్నారట. కాగా దాని అనంతరం హరిహర వీరమల్లు ఆపైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయట. మొత్తంగా అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి పక్కాగా వీటి రిలీజ్ లపై క్లారిటీ రావాలంటే ఆ మూవీస్ యొక్క మేకర్స్ నుంచి అఫీషియల్ గా వీటికి సంబందించి అనౌన్స్ మెంట్ రావాల్సిందే అని తెలుస్తోంది.
మరిన్ని మూవీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి